ఓ రైతుపై అచ్చెన్నాయుడి కుటుంబీకుల అరాచకం 

Anarchy Of Atchannaidu Family Over Farmer - Sakshi

వారికి భూమి విక్రయించలేదని 8 ఏళ్లుగా సామాజిక బహిష్కరణ 

వారి పనులకు వెళ్లిన వారికీ ఇదే గతి అని హెచ్చరికలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో అరాచకం రాజ్యమేలుతోంది. వారు చెప్పినట్టు వినకపోతే సామాజిక బహిష్కరణకు గురికావడమే. టీడీపీ అధికారంలో ఉన్నంత వరకు 26 కుటుంబాలు సామాజిక బహిష్కరణను ఎదుర్కొన్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచి్చన తొలి రోజుల్లో సామూహిక భోజన కార్యక్రమంతో పలు కుటుంబాలను కలుపుకున్నారు. ఇంకా కొన్ని కుటుంబాలు వివక్షకు గురవుతున్నాయి. అచ్చెన్న కుటుంబీకులు చెప్పినట్టు భూములు విక్రయించలేదని మెండ రామ్మూర్తి అనే రైతు ఎనిమిదేళ్లుగా బహిష్కరణ అనుభవిస్తున్నారు. (చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం!)

చెప్పిన ధరకు విక్రయించలేదని... 
మెండ రామ్మూర్తి అనే రైతుకు చెందిన 18 ఎకరాల భూమిని అచ్చెన్నాయుడి అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్‌ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. తాను చెప్పిన ధరకు భూములు విక్రయించలేదని రామ్మూర్తిపై, కుమారుడిపై దౌర్జన్యాలకు పాల్పడటంతో వారు వేరే గ్రామాల్లో తలదాచుకున్నారు. కుమారుడు బంజీరుపేటలో, రామ్మూర్తి పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి గ్రామాల్లో అద్దె ఇళ్లల్లో ఉన్నారు. రామ్మూర్తికి చెందిన పోలాకి మండలం ప్రియాగ్రహారంలో 10 ఎకరాలు, నిమ్మాడలో 3 ఎకరాలు, పెద్దబమ్మిడిలో 3 ఎకరాలు, రాజపురం సమీపంలో 2 ఎకరాలను పంటలు పండించకుండా చేశారు. (చదవండి: ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం)

భూములున్నా తిండికి ఇబ్బందే.. 
మా గ్రామం చుట్టు పక్కల నాకు 18 ఎకరాల భూములు ఉన్నాయి. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్‌ కుటుంబానికి ఎదురు తిరిగామన్న కక్షతో పంటలు పండించకుండా చేస్తున్నారు. తక్కువ ధరకు లాక్కోవడానికి వేధిస్తున్నారు. ఇటీవల సొంతింటికి వచ్చిన నాపై ఇప్పుడు కూడా కక్ష కట్టారు. నాకు ఎవరైనా సాయం చేస్తే వారికి ఇబ్బందులు తప్పవంటూ హరిప్రసాద్‌ హెచ్చరిస్తున్నాడు.  
– మెండ రామ్మూర్తి, బాధితుడు, నిమ్మాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top