పెన్నా బ్యారేజీ పనులు పరిశీలించిన మంత్రులు

Ambati Rambabu Kakani Govardhan Reddy Inspected Penna Barrage Works - Sakshi

సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇ‍చ్చారు. పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయన్నారు.
చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్‌.. రోడ్డు పక్కన హోటల్‌లో టిఫిన్‌ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, పెన్నా ,సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని తెలిపారు.   దివంగత నేత మహానేత వైఎస్సార్‌ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని కాకాణి మండిపడ్డారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా రైతుల కలను సీఎం జగన్‌ సాకారం చేయబోతున్నారని మంత్రి కాకాణి అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top