కరోనా నివారణలో ఏపీ ముందంజలో ఉంది: ఆళ్ల నాని

Alla Nani Talk On YSR Village Clinics In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.94.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వైద్య పరీక్షలు రేటును అన్ని ప్రైవేట్ క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్‌లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజి చొప్పున 16 మెడికల్ కాలేజీలు రూ. 7500 కోట్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని మంత్రి పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top