పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్‌ 

Airplane Circled In The Air Due To Fog In Renigunta Airport - Sakshi

రేణిగుంట: పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవ్వాల్సిన స్పైస్‌జెట్‌ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్‌జెట్‌ విమానం చేరుకుంది. అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్‌ ల్యాండింగ్‌ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్‌ చేశారు.
చదవండి: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top