ఏబీఎన్‌ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ

ABN Venkata Krishna was interrogated by CID - Sakshi

సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి చానల్‌ పాత్రికేయుడు పర్వతనేని వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజులపాటు విచారించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై కొన్ని నెలల కిందట నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల టీవీ 5 మూర్తిని సీఐడీ అధికారులు విచారించారు. అదే కేసులో ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి చానల్‌ పాత్రికేయుడు వెంకటకృష్ణను సీఐడీ అధికారులు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం, మం‍గళవారం దాదాపు 15 గంటలపాటు విచారించారు. 

చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top