బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు | 20 years in prison for molestation case | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు

Sep 3 2026 5:37 AM | Updated on Sep 3 2026 5:37 AM

20 years in prison for molestation case

విజయవాడ లీగల్‌: బాలికపై మాయమాటలతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.జయలక్ష్మి తీర్పునిచ్చారు. విజయవాడ సూర్యారావు­పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని 17 ఏళ్ల బాలికకు తన అన్నయ్య స్నేహితుడు పరిచయమై ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిశాడు. కొద్దిరోజుల తరువాత నిన్ను ప్రేమించడం లేదని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. 

కేసు నమోదు చేసిన అప్పటి సూర్యారావుపేట మహిళా ఎస్సై జి.అనూష అనంతరం అప్పటి సౌత్‌ ఏసీపీ డి.పావన్‌ కుమార్‌ దర్యాప్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామానికి చెందిన కోరేపల్లి ప్రవీణ్‌ కుమార్‌ (37)ను అదుపులో తీసుకొని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికకు రూ.లక్ష నష్ట పరిహారం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement