విజయవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ

150 Workers Join In YSRCP Trade Union - Sakshi

వైఎస్‌ఆర్‌టీయూసీలోకి 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరిక

సాక్షి, విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌లోకి టీడీపీకి చెందిన 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరారు. వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఆయన పనితీరును చూసి ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. (చదవండి: అందులో ప‌ట్టుబ‌డ్డ‌వారంతా టీడీపీ కార్య‌క‌ర్త‌లే)

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా భవిష్యత్‌ తరాలకు మంచి జరుగుతుందనే ఉద్ధేశ్యంతో నగరంలోని టీడీపీకి చెందిన స్వీట్‌ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్  అసోసియేషన్ సభ్యులు పార్టీలోకి జాయిన్‌ అయ్యారని పేర్కొన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ స్వీట్‌ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సైతం ప్రారంభించదలుచుకున్నామని వెల్లడించారు. టీడీపీలో ఆదరణ లేకపోగా, కులాల కంపుతో తమ అస్తిత్వాన్ని చంపుకుని ఉండలేమని అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్‌సీపీలోకి చేరారని తెలిపారు. ప్రజల మనిషిగా, పేదలకు సాయం చేసే వ్యక్తిగా ఉన్న సీఎం జగన్‌ వెంట తాము నడుస్తామని వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top