ఈ ‘పాప’ం ఎవరిదో..? | - | Sakshi
Sakshi News home page

ఈ ‘పాప’ం ఎవరిదో..?

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

గుత్తి: ఆడ పిల్ల భారమనో.. అనారోగ్యంతో బాధపడుతోందనో.. పోషణ భారమైందనో.. లేక ఇంకేదైనా కారణమో తెలియదు.. నిర్దయగా వ్యవహరించి.. వదిలించుకున్నారు. తల, పెదవి, వీపుపై రక్తగాయాలు.. అక్కడక్కడా పుండ్లతో బాధపడుతూ.. ఆకలికి అలమటిస్తూ.. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును స్థానికులు అక్కున చేర్చుకున్నారు. బుధవారం ఉదయం గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ రోడ్డు బ్రిడ్జి సమీపాన ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న ఆడశిశువును ఒంటిపై బట్టలు లేకుండా ఎవరో నేలపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఓ వైపు గాయాలు.. మరోవైపు రాళ్లురప్పలు గుచ్చుకుంటుండటంతో ఏడ్వడం మొదలుపెట్టింది. అదే సమయంలో స్థానిక సెయింట్‌ మేరీస్‌ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు గమనించి.. ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం చేరవేశారు. ఇంతలో స్థానిక యువకుడు రాజా స్పందించి శిశువును తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శిశువుకు తల, వీపు, పెదవులు, తదితర చోట్ల గాయాలున్నాయి. వైద్యం చేయించిన తర్వాత ఐసీడీఎస్‌ అధికారులు వచ్చి శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. శిశువును వదిలేసిన వారి కోసం ఆరా తీస్తున్నారు. ఉదయం ఎవరో అపరిచిత జంట అక్కడ కూర్చుని ఉందని, వారే పాపను వదిలేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement