పోలీసుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

పోలీసుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

న్యూస్‌రీల్‌

అనంతపురం సెంట్రల్‌: పోలీసుల నుంచి ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైఎస్సార్‌సీపీ, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మలోలను కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందన్నారు. పోలీసుల నుంచే ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అడుక్కునే పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు. శింగనమల నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు గ్రామాలపై పడి వైఎస్సార్‌సీపీ నాయకులను అర్ధరాత్రి పూట స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారన్నారు. అదే గ్రామాల్లో తాము పర్యటించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలను తాను ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారన్నారు. వ్యవస్థలు, రాజ్యాంగంపై గౌరవంతో రాజకీయం చేసే తమలాంటి నాయకులకు ఈ ఎన్నికలు కొత్త విషయాలను నేర్పించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిస్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారని, కనీసం ఫోన్లు కూడా ఎత్తరని తెలిపారు. కనీసం ఈ రెండు రోజులైనా ప్రజలను బెదిరించకుండా ఉండాలని కోరారు. లేదు మేమింతే అంటే అన్నింటికీ ఓ సమయం వస్తుందని, తప్పు చేసిన అధికారులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement