అనంతపురం న్యూ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేని అధికారపక్షం పన్నని కుట్రంటూ లేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక రూపంలో వైఎస్సార్‌సీపీ నేతలను, అభ్యర్థులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూనే వస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏదో ఒక రూపంలో హింసకు పాల్పడుతూనే ఉన్నారు. అయినా లెక్క చేయని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సామాన్య ప్రజానీకానికి కనీస అవసరాలను సైతం తీర్చలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని వర్గం లేదని, ఆ పార్టీ నేతలు ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.
బొమ్మనహాళ్‌లో ఓటు అభ్యర్థిస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్గ మెట్టు గోవిందరెడ్డి
ఉరవకొండ మండలం రాకెట్ల తండాలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేత ప్రణయ్‌రెడ్డి
కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పూలతో స్వాగతం


