దగ్గుపాటి నేతృత్వంలో దౌర్జన్యాలు | - | Sakshi
Sakshi News home page

దగ్గుపాటి నేతృత్వంలో దౌర్జన్యాలు

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ నగరంలోని 11వ డివిజన్‌ (కస్తూర్బా స్కూల్‌) సహా పలు పోలింగ్‌ కేంద్రాల్లో కలియతిరుగుతూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. నేతాజీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసులను ఎమ్మెల్యే బూతులు తిడుతూ బెదిరింపులకు దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పర్యటించిన ప్రతి డివిజన్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఐడీ కార్డులు చించివేసి, కేంద్రాల నుంచి బయటకు పంపేలా పోలీసులు సహకరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐడీ కార్డు.. ఓటరు జాబితా

చించేసిన దగ్గుపాటి

అనంతపురం సెంట్రల్‌: నాలుగో డివిజన్‌లోని ఛత్రపతి శివాజీ నగరపాలక ప్రాథమిక పాఠశాల పోలింగ్‌ బూత్‌లోకి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరులతో కలిసి చొరబడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ ఐడెంటిటీ కార్డు, ఓటరు జాబితాను చింపివేశారు. అనంతరం ఒకటో డివిజన్‌లోని మత్య్సశాఖ ఏడీ కార్యాలయం పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి. స్వతంత్ర అభ్యర్థి అజీజ్‌పై దాడికి యత్నించడంతో పాటు ఓ గదిలో నిర్బంధించారు. పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ హుటాహుటిన వచ్చి అనధికార వ్యక్తులను పోలింగ్‌బూత్‌లోకి ఎలా అనుమతిస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement