శెట్టూరు: మండల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కె.మహాదేవి నామినేషన్ పత్రాలు సమర్పించింది. శుక్రవారం ఆమె నాలుగు నెలల చిన్నారిని ఎత్తుకొని నామినేషన్ వేయడానికి రావడం అక్కడున్న వారి చేత ఔరా అనిపించేలా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అలజడులను చూస్తున్నా.. ఆమె చిన్నారితో నామినేషన్ వేయడానికి రావడం పలువురిని అవాక్కు చేసింది. వైఎస్ జగన్ ఆశయసాధన.. వైఎస్సార్సీపీపై మక్కువతో జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. మండలానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో మహాదేవి తన నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ మంజునాథ, మండల కన్వీనర్ ఎమ్మెఎస్ రాయుడు, మాజీ ఎంపీపీ రామభీమప్ప, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


