ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

అనంతపురం సెంట్రల్‌: త్రిపుల్‌ ఐటీలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఐదో రోడ్డులో జరిగింది. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న సుబ్బరెడ్డి కుమార్తె తనుశ్రీ(18) ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీలో ఇంటర్‌ చదువుతోంది. దసరా సెలవులకు వచ్చిన విద్యార్థిని చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు తల్లిదండ్రులకు తెలిపింది. సెలవులు ముగియడంతో శనివారం కళాశాలకు బయలుదేరాల్సి ఉంది. ఇంతలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనాస్థలాన్ని త్రీటౌన్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement