చిలమత్తూరు: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, నయనతారెడ్డిలను రాష్ట్ర సరిహద్దు బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద హిందూపురం పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం బెంగళూరు నుంచి రాప్తాడు వెళ్తున్న వారిని వెళ్లనియ్యలేదు. తాము తప్పనిసరిగా వెళ్లాల్సి ఉందని చెప్పినా వినకపోవడంతో పోలీసుల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. తమను అడ్డుకున్నా ప్రజల మనసుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, టీడీపీకి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.


