అధికారమే అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండోరోజూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. రాళ్లు విసురుతూ, భౌతిక దాడులు చేస్తూ అలజడి సృష్టించారు. ఇంత జరుగుతున్నా | - | Sakshi
Sakshi News home page

అధికారమే అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండోరోజూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. రాళ్లు విసురుతూ, భౌతిక దాడులు చేస్తూ అలజడి సృష్టించారు. ఇంత జరుగుతున్నా

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతమైన తాడిపత్రికి అపఖ్యాతి తీసుకురావడంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి విజయవంతమయ్యారు. గంజాయ్‌, బ్లేడ్‌బ్యాచ్‌ రౌడీలను పెంచి పోషిస్తూ వారితో ప్రత్యర్థులను బెదిరించేందుకు వాడుకుంటున్నారు. మాటవినని వారిని కిడ్నాప్‌ చేయడంతో పాటు ఇళ్ల వద్దకు వచ్చి దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో చేసిన అరాచకాలనే పరిషత్‌ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నారు. పెద్దవడుగూరులో నామినేషన్‌ వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అభ్యర్థులంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

రాప్తాడు నియోజకవర్గంలో తమ్ముళ్ల అరాచకం

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని వడ్డుపల్లి వద్ద అడ్డుకున్నారు. మండల కేంద్రంలో సుమారు వెయ్యి మంది టీడీపీ గూండాలు మోహరించారు. కట్టెలు, రాళ్లు, రాడ్లతో నిల్చుని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బుధ, గురువారాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఏ ఒక్కరూ నామినేషన్‌ వేయలేకపోయారు. అనంతపురం రూరల్‌ మండలంలోనూ పరిటాల అనుచరులు నామినేషన్‌ పత్రాలను చించుతూ స్వైర విహారం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త బీసీ రాముడిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. మహిళల చేతుల్లోంచి నామినేషన్ల పత్రాలను తీసుకెళ్లి చించేస్తున్నా పోలీసులు అడ్డుకోకపోవడం గమనార్హం.

యల్లనూరులో భయం..భయం

జేసీ ప్రభాకర్‌రెడ్డి యల్లనూరు, పుట్లూరుకు తన విష సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారు. యల్లనూరులో గురువారం ఉదయం నుంచి టీడీపీ గూండాలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. గురువారం యల్లనూరులో వైఎస్సార్‌సీపీ నుంచి ఏ ఒక్క నామినేషన్‌ను వేయించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన్ను తాడిపత్రికి తరలించారు. అలాగే వెన్నపూసపల్లిలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగతి విజయ ప్రతాప్‌రెడ్డిని కస్తూర్భా పాఠశాల వద్ద కంచె ఏర్పాటు చేసి అడిషన్‌ ఎస్పీ నాగభూషణం అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి నిరసన తెలిపారు.

గుంతకల్లులో ఆటవిక రాజ్యం

గుంతకల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బరితెగిస్తున్నారు. గుత్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్న వైనంపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా మార్పురాలేదు. పరిషత్‌ ఎన్నికలకు బుధ, గురువారాల్లో తీవ్ర ఆటంకాలు కల్పించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి బురఖా వేసుకుని నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. 13 మంది అభ్యర్థుల పత్రాలను చూపించి, అభ్యర్థులు బయటే ఉన్నారని నామినేషన్లు స్వీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. టీడీపీ గూండాలు లోనికి వచ్చి ఆమె చేతిలో ఉన్న పత్రాలను బలవంతంగా లాక్కొని చింపేశారు. పచ్చ మూకల అరాచకంపై రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల వేళ తమ్ముళ్ల బరితెగింపు

పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు, భౌతికదాడులు

నామినేషన్‌ పత్రాలు లాక్కొని చింపేసిన వైనం

పోలీసుల ప్రేక్షకపాత్రపై సర్వత్రా విమర్శలు

తెల్లవారుజాము నుంచే వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement