ఓటమి భయంతోనే అక్రమ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే అక్రమ నిర్బంధం

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. స్థానిక సంస్థల నామినేషన్ల వేళ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలు, దౌర్జన్యాలకు నిరసనగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోందన్నారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు తెగబడటం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికే అద్దం పడుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement