వైఎస్సార్‌సీపీ నేతపై పిడిగుద్దులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై పిడిగుద్దులు

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

పెద్దవడుగూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు శేషానందరెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. రెండోరోజు నామినేషన్లు విషయమై చర్చించడానికి పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు చెప్పడంతో గుత్తి అనంతపురం వైఎస్సార్‌సీపీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, శేషానందరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా అప్పటికే మార్గమధ్యలో కాపుకాచిన టీడీపీ మూకలు శేషానందరెడ్డిపై దాడి తెగబడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాక అక్కడి నుంచి పచ్చ మూకలు పరారయ్యాయి.

ఒక్క నామినేషన్‌ వేస్తే ఒట్టు

పెద్దవడుగూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద నుంచి అభ్యర్థులు 13 ఎంపీటీసీ స్థానాలకు ఒకేసారి నామినేషన్లు వేయడానికి బయలు దేరుతుండగా సీఐ నరేంద్రరెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నారు. తమను కాదని నామినేషన్లు వేయడానికి వెళ్లకూడదన్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి రోడ్డుపై బైఠాయించారు. 23వ తేదీ వైఎస్సార్‌సీపీ వాళ్లతో నామినేషన్లు వేయించడానికి చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement