స్థానిక సంస్థల ఎన్నికల వేళ ‘పచ్చ’ గూండాలు బరితెగించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి రాక్షసకాండ సాగించారు. రెండున్నరేళ్ల పాలనలో చేసేందేమీ లేకపోవడంతో చెప్పుకునే ధైర్యం లేక క | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ‘పచ్చ’ గూండాలు బరితెగించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి రాక్షసకాండ సాగించారు. రెండున్నరేళ్ల పాలనలో చేసేందేమీ లేకపోవడంతో చెప్పుకునే ధైర్యం లేక క

Oct 17 2026 3:15 AM | Updated on Oct 17 2026 3:15 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారం మొదలైంది. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ రౌడీలు విధ్వంసం సృష్టించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాళ్లు, కర్రలు, రాడ్లతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఇన్‌చార్జ్‌ హరీష్‌ బాబు నేతృత్వంలో సుమారు 200 మంది రౌడీలు అరాచకం సృష్టించారు. వీరికి టీడీపీ గూండాలు కూడా జత కలిశారు.

తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ధర్మవరంలో బీజేపీ – టీడీపీ గూండాల దాడిలో 22 మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వీరిలో అప్రాశ్చెర్వు ఈశ్వరయ్య, ఆదినారాయణ, బగ్గిరి బయపరెడ్డి, బాలంగోపాల్‌, గుండా ఈశ్వరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పట్ణణంలోని బీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో నామినేషన్లు వేసేందుకు వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం వారిని వీల్‌చైర్లలో తీసుకొచ్చి ధర్నా చేశారు. మరోవైపు మేడాపురం వెంకటేశ్‌, బాలం గోపాల్‌, ఎర్రగుంట్ల భాగ్యలక్ష్మి, మాసుపల్లి సాయికుమార్‌లు నామినేషన్లు వేసేందుకు వెళుతుండగా వారిని అడ్డగించి.. వారి పత్రాలను కూటమి గూండాలు చించేశారు.

తాడిపత్రిలోనూ అవే ఆగడాలు

రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. ఇక్కడ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఇంటి వద్ద టీడీపీ గూండాలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షానికి భరోసా ఇవ్వడంలో పోలీసులు పూర్తిగా విఫలమవడమే కాకుండా.. అక్రమ కేసులు నమోదు చేస్తూ అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి బస్తీమే సవాల్‌ అంటూ మాట్లాడిన దానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందిస్తూ జేసీ ఆగడాలను దీటుగా ఎదుర్కొంటామంటూ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దీనిపై పోలీసులు బీఎన్‌ఎస్‌ 192, 351(2), 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల అంతుచూస్తానని పదేపదే హెచ్చరిస్తూ మాట్లాడుతున్నా జేసీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

కళ్యాణదుర్గంలో అధికారుల నిర్లక్ష్యం

స్థానిక ఎన్నికల వేళ కళ్యాణదుర్గం మున్సిపల్‌ అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని డైరెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి హర్షిణితో పాటు కౌన్సిలర్‌ అభ్యర్థులు ఇంటి– నీటి పన్ను చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు మున్సిపల్‌ అధికారులను సంప్రదించారు. అయితే అక్కడ పన్నులు కట్టించుకునేందుకు ససేమిరా అన్నారు. సాంకేతిక సమస్య ఉందని, సిబ్బంది తక్కువగా ఉన్నారని కాలయాపన చేస్తూ వచ్చారు. గంటల తరబడి వేచి చూసినా పట్టించుకోలేదు. అధికారుల తీరును తప్పు పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు కమిషనర్‌ ఎదుట నిరసన తెలియజేశారు. ఎన్నికల నిబంధనలను పాటించాల్సిన అధికారులు టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లాలో ‘పచ్చ’ మూక దమనకాండ

బరితెగించి దాడులకు ఉసిగొల్పిన ప్రజాప్రతినిధులు

కళ్లముందే రాక్షసకాండ సాగుతున్నా పట్టించుకోని పోలీసులు

ధర్మవరంలో బీజేపీ ఇన్‌చార్జ్‌ నేతృత్వంలో రెచ్చిపోయిన గూండాలు

దాడుల్లో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు.. బాధితులతో కేతిరెడ్డి ధర్నా

తాడిపత్రిలో బెదిరింపులకు పాల్పడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు

గుత్తిలో వైఎస్సార్‌సీపీ నేత నరహరిపై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement