గుత్తి మున్సిపాలిటీలో 22వ వార్డుకు వైఎస్సార్సీపీ నుంచి దస్తగిరి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు దస్తగిరి ఇంటికి వెళ్లి బెదిరించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో తమ్ముడు జిలాన్ను కిడ్నాప్ చేశారు. దస్తగిరి పోటీ చేస్తే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లిపోయారు. సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంటా నరహరిపై ‘పచ్చ’ మూక దాడి చేయడంతో పాటు కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే దాడి జరుగుతున్నా నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. దీంతో గంటా నరహరి అనంతపురం వెళ్లి కలెక్టర్, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేశారు. నామినేషన్ వేసుకోవడానికి తగిన భద్రత కల్పిస్తామని వారు గంటాకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ను కలిస్తే నామినేషన్ పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులందరూ శనివారం నామినేషన్ వేస్తారని, ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
గుత్తిలో నరహరి కారు అద్దాలను ధ్వంసం చేసిన దృశ్యం (ఇన్సెట్) కిడ్నాప్నకు గురైన జిలాన్


