వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా రమేష్‌ గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా రమేష్‌ గౌడ్‌

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా విశేషమైన సేవలు

అనంతపురం: నగరపాలక సంస్థ మేయర్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రమేష్‌గౌడ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. మేయర్‌ స్థానానికి తొలిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నిక జరగనుంది. పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా విశేషమైన సేవలందించిన రమేష్‌ గౌడ్‌ మేయర్‌ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నాడు. చిట్లూరు రమేష్‌ గౌడ్‌ (బీసీ రమేష్‌ గౌడ్‌) ఉన్నత విద్యావంతుడు. ఎస్కేయూలో ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. వ్యక్తిగత అభివృద్ధిని కోరుకోకుండా, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల, అగ్రవర్ణ పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బీసీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బహుజన వర్గాల హక్కుల కోసం పోరాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జోనల్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా, సామాజిక కార్యకర్తగా ప్రజల మన్ననలు పొందారు. సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక సమానత్వం దక్కాలని నిరంతరం పరితపిస్తున్నారు. అంతే కాదు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడే తత్వం ఆయనది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో, ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రజల పక్షాన గట్టిగా గళం వినిపిస్తున్నారు. రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

● బీసీ అసోసియేషన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి, వెనుకబడిన తరగతుల హక్కులు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వాలు, అధికారులతో చర్చలు జరిపారు.

సామాజిక సేవ, ఇతర కార్యక్రమాలు: విద్యార్థులకు మద్దతుగా నిలవడం, వైద్య శిబిరాలను నిర్వహించడం, పేదలకు సహాయం చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కష్ట కాలంలో అనేక మండలాల్లో ప్రజలకు నిత్యావసరాలు, అవసరమైన సహాయ సహకారాలను అందించడంలో కీలక భూమిక పోషించారు.

బయోడేటా..

పేరు : చిట్లూరు రమేష్‌ గౌడ్‌

తల్లిదండ్రులు : చిట్లూరు గంగయ్య,

శాంతమ్మ

పుట్టిన తేదీ : 1984

విద్యార్హత : ఎమ్మెస్సీ, బీఈడీ

రాజకీయ ప్రస్థానం: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement