రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

యల్లనూరు: జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో అండర్‌–14 బాలుర విభాగంలో పుట్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు బి.హర్ష, పీ ఆదిత్య ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులు హర్ష, ఆదిత్య, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును ఎంఈఓలు శ్రీదేవి, ప్రేమ్‌కుమార్‌, హెచ్‌ఎం ప్రమీల, ఉపాధ్యాయులు అభినందించారు.

ఇద్దరు డీఎస్పీల బదిలీ

అనంతపురం సెంట్రల్‌: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబును హిందూపురం డీఎస్పీగా బదిలీ చేశారు. విజయవాడ కమిషనరేట్‌లో పనిచేస్తున్న డీఎస్పీ దైవ ప్రసాద్‌ను కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమించారు.

బీసీ రిజర్వేషన్ల పేరుతో

చంద్రబాబు డ్రామా

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాగా సాహసోపేత రాజకీయ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ హరీష్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కనీస అవగాహన ఉన్న ఎవరికై నా తెలుసన్నారు. తెలంగాణలో కమిషన్‌ సిఫార్సుల మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసీ ఏపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో జీవో తెచ్చిందని, కోర్టులు కొట్టివేస్తే ఆ నెపాన్ని ఇతరులపై నెట్టి రాజకీయ లబ్ధి పొందడానికే ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. గతంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 50 శాతం పరిమితి అడ్డంకిగా మారినప్పుడు కోర్టుల పేరిట సాకులు చెప్పి చేతులు దులుపుకోలేదని హరీష్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలతోపాటు అనేక జనరల్‌ స్థానాల్లో బీసీలను నిలబెట్టి గెలిపించారన్నారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఏకంగా 40 శాతానికి పైగా స్థానాల్లో బీసీలకే అవకాశాలు కల్పించి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.

రూ.లక్షకు 5 తులాల బంగారం!

● అమాయకులను బురిడీ కొట్టించిన లేడీ

● నగదు వచ్చాక.. బంగారు ఇవ్వకుండా మౌనం

● పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు

రాప్తాడు రూరల్‌: బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. తులం రూ.1.50 లక్ష పలుకుతోంది. ఇలాంటి సమయంలో రూ.లక్షకే ఐదు తులాల బంగారం ఇస్తానని ఓ మహిళ చెప్పడంతో పలువురు నిజమని నమ్మి మోసపోయారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన శిల్ప ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటోంది. తన భర్త దుబాయిలో ఉంటారని, అక్కడి నుంచి తక్కువ ధరకు బంగారం తెప్పించి ఇస్తానంటూ ఆమె అనంతపురం రూరల్‌ పరిధిలోని మండ్ల సుబ్బారెడ్డికాలనీకి చెందిన ముగ్గురు మహిళలను నమ్మించింది. అందులో ఒక మహిళ రూ.14 లక్షలు శిల్ప ఖాతాకు బదిలీ చేసింది. మిగిలిన ఇద్దరు కూడా రూ.లక్షల్లోనే చెల్లించారు. అయితే ఇప్పటివరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదు. పలుమార్లు డబ్బు లేదా బంగారం గురించి అడిగినా శిల్ప నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధితులు తాము మోసం పోయామని గ్రహించి అనంతపురం రూరల్‌ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత డబ్బులు వసూలు చేశారు? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement