ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమించాలి

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

అనంతపురం: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, పార్టీ పీఏసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ మూల స్ఫూర్తిని, ప్రజాస్వామ్య పునాదులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్వేచ్ఛా, సమానత్వాల కోసం నాటి నాయకులు పోరాడితే, నేడు ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి మళ్లీ పోరాటాలు చేయాల్సి రావడం విచారకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, మాజీ మేయర్‌ వసీం సలీం, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు దేశాయి భారతి, నీరజ, మాజీ డిప్యూటీ మేయర్‌ దాసరి వాసంతి సాహిత్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, సుజాతరెడ్డి, బూత్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్‌నాథరెడ్డి, మల్లెల వేణుగోపాల్‌, జావేద్‌, సాకే కుళ్లాయిస్వామి, సాకే అశోక్‌కుమార్‌, సాకే చంద్రలేఖ, చంద్రశేఖర్‌ యాదవ్‌, కై లాష్‌, శోభాబాయి, లక్ష్మీనరసమ్మ, అంజలి, భారతి, ఉష, గుజ్జల శివయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement