తప్పును సరిదిద్దుకునే గుణం ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తప్పును సరిదిద్దుకునే గుణం ఉండాలి

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

బుక్కరాయసముద్రం: సమాజంలో తప్పు చేయని వారు ఎవరూ ఉండరని, అయితే చేసిన తప్పును సరిదిద్దుకున్న వాడే ఉత్తముడని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. శుక్రవారం రెడ్డిపల్లి జిల్లా జైలు, ఓపన్‌ ఎయిర్‌ జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ ఆనంద్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ రాజశేఖర్‌ హాజరై గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తన కలిగి త్వరగా బయటకు వెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. ఖైదీలు విడుదలయ్యాక సొంత కాళ్లపై నిలబడి బతికే నైపుణ్యాలను జైలులో నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందించేలా చర్యలు చేపడుతామని జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ సెక్రటరీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. జైల్లో మంచి అలవాట్లు, కట్టుబాట్లను నేర్చుకుని బయటకు వెళ్లి ప్రశాంత జీవనం గడపాలన్నారు. దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఇలియాజ్‌ బాషా, డీడీఎంకే అనూరాధ, జిల్లాజైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధి మమత, రమేష్‌, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

మహాత్ముని బాటలో నడవాలి

అనంతపురం అర్బన్‌: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని డీఆర్‌ఓ మలోల సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి డీఆర్‌ఓ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో సత్యం, అహింసను ఆయుధంగా చేసుకుని పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహా త్ముని ఆశయసాధన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామ్మోహన్‌, పరిపాలనాధికారి అలెగ్జాండర్‌, విభాగాధిపతులు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement