నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఏడీఏ కళ్యాణకుమార్‌

అనంతపురం అగ్రికల్చర్‌: నిషేధిత పత్తి విత్తనాలు రైతులకు అంటగడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన విక్రయ దుకాణదారులను వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు చెందిన ఏడీఏ కళ్యాణ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఇన్‌చార్జ్‌ ఏడీఏ ఎ.వెంకటకుమార్‌, ఏఓలు రాకేష్‌నాయక్‌, శ్రీనాథ్‌రెడ్డితో కలిసి గురువారం అనంతపురంలోని పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో అనుమతి లేని కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు అమ్మడానికి వీలులేదన్నారు. ఈ సందర్భంగా విత్తన దుకాణాల్లో నిల్వ చేసిన పత్తి విత్తనాలను పరిశీలించి... పురుగు మందులను తట్టుకునే అంశంపై పరీక్షలు నిర్వహించారు. కొన్ని విత్తన నమూనాలు సేకరించారు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లోనే పత్తి విత్తనాలు తీసుకోవాలని, తప్పనిసరిగా రసీదు పొందాలని రైతులకు సూచించారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement