హంస వాహనంపై వీణాపాణి | - | Sakshi
Sakshi News home page

హంస వాహనంపై వీణాపాణి

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

హంస వాహనంపై వీణాపాణి

హంస వాహనంపై వీణాపాణి

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు ఆదివారం రాత్రి వీణాపాణిగా హంస వాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరు వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగితేలారు. ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్‌శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మ వాహనమైన హంసకు ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచి, చెడును గ్రహించ గలిగిన అపురూపమైన శక్తి దీని సొంతం. అందుకే ఉపనిషత్తులు పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతున్న నారసింహుడిని దర్శించుకుంటే అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు.

నేడు సింహ వాహనం..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిస్తారు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటిచెప్పడానికే శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మంటపోత్సవం నిర్వహిస్తారు. యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement