చంద్రమౌళీశా ... శరణు
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు నాగాభరణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం స్వామి వారికి ఆలయ అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి కరిబసవరాజేంద్రస్వామి, దేవదాయ శాఖ సహయ కమిషనర్ గంజిమల్లికార్జునప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా నాగభరణ వాహనం వద్దకు తెచ్చి దానిపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.


