అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో వింత పోకడలు నెలకొన్నా
అనంతపురం క్రైం: అతి పెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిక్కూమొక్కు లేనిదైంది. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు పరిష్కారం కాక సంస్థ ఉద్యోగులు సతమమవుతున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సీ్త్రశక్తి పేరుతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామంటూ గొప్పలకు పోతున్న ప్రభుత్వ పెద్దలు సగటు ప్రయాణికుడి ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిపోల్లోనే ఆగిపోతున్న బస్సులు
ఇప్పటికే అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లాల్సిన లాంగ్ సర్వీసు బస్సును గుత్తి డిపోకు బదిలీ చేసి ఆర్‌ఎం శ్రీలక్ష్మి చేతులు దులుపుకుంటే ఆ బస్సు డిపోకు మాత్రమే పరిమితం చేసి మేనేజరు పూర్తిగా తప్పుకున్నారు. తాజాగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ బస్సు ఆగిపోతే దానిని వర్క్‌షాప్‌నకు తరలించేందుకు కొన్ని గంటల పాటు మెకానిక్‌లు శ్రమించాల్సి వచ్చింది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అధికారి లేకపోవడం, ఉన్నవారికి అనుభవం లేకపోవడంతో డిపోల్లోనే బస్సులు ఆగిపోతున్నాయి. దీనికి తోడు రూ.10 ఖర్చు పెట్టాల్సిన చోట రూ.100 ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతోంది.
సెలవులో లేరు.. విధులకు రారు
అనంతపురం ఆర్టీసీ రీజియన్ మేనేజర్‌గా విజయలక్ష్మి గత నెల 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎన్నడూ లేని విధంగా అనంతపురం నుంచి విజయవాడకు ఫైలు తెప్పించుకుని అక్కడే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదేమని ఆరా తీస్తే తాను ఓ మంత్రిగారికి చెల్లెలని తెలిపిందట. బాధ్యతలు స్వీకరించేదాకా అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి వరకూ అనంతపురం రీజియన్ కార్యాలయంలోకి ఆమె కాలు కూడా మోపలేదు. అయితే ఆమె సెలవులో ఉన్నారనుకుంటే అది కూడా పొరబాటేనని ఉద్యోగులు అంటున్నారు. కనీసం ఇన్‌చార్జ్‌గాను ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని దీంతో గతంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డిప్యూటీ సీటీఎం శ్రీలక్ష్మినే అలాగే కొనసాగుతోంది. పూర్తి స్థాయి ఆర్‌ఎం ఎప్పుడొస్తారనే అంశంపై స్పష్టత లేదు. మంత్రి సోధరి అనే హోదానే ఆమెను ఇక్కడకు రాకుండా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.
‘అనంత’ ఆర్టీసీలో వింత పోకడ విజయవాడలోనే అనంత ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వకపోయినా ఆర్‌ఎంగా కొనసాగుతున్న శ్రీలక్ష్మి సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగుల సతమతం
ఉరవకొండ అసిస్టెంట్ మేనేజర్‌కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అనంతపురం, తాడిపత్రి డిపోలకూ అసిస్టెంట్ డిపో మేనేజర్లే దిక్కు
ఎక్కడికక్కడ డిపోల్లో ఆగిపోతున్న బస్సులు జోనల్ చైర్మన్‌కు పట్టని ఆర్టీసీ అభివృద్ధి
సమస్యల సుడిగుండం
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఇన్‌చార్జ్‌ల పాలన ఎక్కువైంది. చివరకు జోనల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజుకు సైతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్టీసీ అభివృద్ధిని ఆయన పూర్తిగా అటకెక్కించేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాడిపత్రి డిపో అసిస్టెంట్ మేనేజరు మురళీధర్‌కు అనంతపురం డిపో ఇన్‌చార్జ్ మేనేజర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. ఉరవకొండ డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అప్పగించారు. ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలో సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు సతమతమవుతున్నారు.
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో వింత పోకడలు నెలకొన్నా


