క్రిస్టియన్లపై దాడి అమానుషం
అనంతపురం టవర్‌క్లాక్: కూడేరు మండలం కొర్రకొడు గ్రామంలో సువార్త పరిచర్యకు వెళ్లిన క్రిష్టియన్ పెద్దలపై దాడి చేయడం అమానుషమని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు అన్నారు. దాడిని ఖండిస్తూ బుధవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం కొర్రకోడులో సువార్త పరిచర్యకు వెళ్లిన క్రిస్టియన్ మైనారిటీలపై అతి దారుణంగా దాడికి తెగబడ్డారని, బస్సుపై రాళ్లు రువ్వి, రాడ్లతో కొడుతూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదులో నిర్లక్ష్యం కనబరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసి బస్సును తగల పెట్టడానికి చూసిన వారిపై బెయిల్‌బుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మతోన్మాద శక్తులకు అండగా నిలవకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, నాయకులు చిలకల థామస్ రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, పుట్లూరు ప్రభాకర్, సతీష్, జావీద్, ఆదినారాయణ, దేవవరం, నూకల కమల్, సైఫుల్లాబేగ్, ఖాజా, దాదు, షమ్ము, షామీర్, మసూద్, అబ్బాస్, కేఎం బాషా, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు


