ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి

Oct 24 2026 5:05 AM | Updated on Oct 24 2026 5:05 AM

● ప్రాదేశిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ● ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు ఎన్నికల సిబ్బందికి, పోలీస్‌ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలు వద్ద పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేసామన్నారు. అభ్యర్థులు ఎవరైనా భయభ్రాంతులకు గురికాకుండా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్‌ దాఖలు చేయకుండా ఎవరిని బెదిరించినా, ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా దగ్గరలో పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు, సజావుగా పారదర్శకంగా జరిగేదందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement