అనకాపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా 1450 విద్యుత్ బస్సులను ప్రైవేట్ టెండర్లకు అప్పగించడం వల్ల రానున్న రోజుల్లో ఆర్టీసీ మనుగడకు ముప్పుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి సొంత సిబ్బందితో నడిపించాలని ప్రజారవాణాశాఖ జిల్లా జేఏసీ నాయకులు బి.ఎన్.వి.పరమేశ్వరరావు, బి.ఎ.రావు, కె.ఎం.నాథ్‌లు అన్నారు. స్థానిక డిపో గేటు వద్ద జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరిచి ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ డిపోల మౌలిక సదుపాయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదన్నారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 15వేల పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈనెల 26న విజయవాడలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెటి దామోదర్‌రావు ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎం.జె.పి.కె.రావు, వై.ఎస్.కుమార్, ఆర్.ఎస్.ఆర్.మూర్తి పాల్గొన్నారు.


