కౌంటింగ్ హాల్‌ను పరిశీలిస్తున్న జేసీ శౌర్యమాన్ పటేల్
నర్సీపట్నం : మున్సిపాలిటీ ఎలక్షన్‌కు సంబంధించి పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాల్స్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ శుక్రవారం పరిశీలించారు. ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి వి.వి.రమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆర్డీవో వెంట మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, తహసీల్దార్ రామారావు, టీపీవో సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


