జి.భీమవరంలో పంచాయతీ రికార్డులను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ కమిషనర్ ఓఎస్‌డి సూర్య బృందం
కశింకోట : జి. భీమవరం గ్రామ పంచాయతీని జాతీయ పంచాయతీ పురస్కారానికి ప్రతిపాదించిన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన రాష్ట్ర బృందం శుక్రవారం సందర్శించింది. పంచాయతీరాజ్ కమిషనర్ ఓఎస్‌డి సూర్య, అదనపు డైరెక్టర్ ఎన్. వినోద్ పంచాయతీలో పర్యటించి పంచాయతీ ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌కు అర్హత సాధించిన విధానం, జాతీయ పంచాయతీ పురస్కారం కోసం పీఎఐ ఇండక్స్‌లో సాధించిన స్కోరు, చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహించిన రికార్డులను తనిఖీ చేశారు. కేంద్ర బృందం అడిగే ప్రశ్నలకు సమర్ధంగా సమాధానాలు ఇచ్చేలా రికార్డులు, సేవలు రూపొందించి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.


