తొలి రోజు నామినేషన్లు డల్‌ | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు నామినేషన్లు డల్‌

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

● అనకాపల్లి జోన్‌లో నిల్‌

● బీజేపీకి, టీడీపీకి తప్పని రెబల్‌ బెడద

● జిల్లాలో రెండు మున్సిపాలిటీ వార్డులకు 9 నామినేషన్లు దాఖలు

● రెండు చైర్‌పర్సన్‌ స్థానాలకు

ఐదు నామినేషన్లు

సాక్షి, అనకాపల్లి : అత్యంత తక్కువ సమయంలో ఎన్నికలకు సన్నద్ధత కావాల్సిన రాజకీయ పార్టీలు నామినేషన్లు వేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని జీవీఎంసీ జోన్‌ పరిధిలో కూటమి ఇంకా అభ్యర్థుల ఖరారుకు కుస్తీ పడుతోంది.అనకాపల్లి జిల్లా పరిధిలోని అనకాపల్లి జోన్‌తో పాటు,యలమంచిలి మున్సిపాలిటీ,నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలకు గానూ శుక్రవారం నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఆశించిన మేరకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం.

తొలి రోజు డల్‌...

జీవీఎంసీ పరిధిలో 120 వార్డులు ఉండగా అనకాపల్లి జోన్‌లో కేవలం ఆరు వార్డులు మాత్రమే ఉన్నాయి. ఈ వార్డులన్ని టికీ మహిళా రిజర్వేషన్లు కేటాయించడంతో సహజంగా అభ్యర్థులు కాస్త నిరాశకు గురయ్యారు. కాగా తొలి రోజు అనకాపల్లి జోన్‌ పరిఽధిలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులకు గానూ ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యింది.ఇక్కడ కూడా స్తబ్ధతగానే ఉంది.నర్షీపట్నం పరిధిలోని 40 వార్డులకు గానూ 10 నామినేషన్లు దాఖలు అయ్యి కాస్త ముందంజలో ఉంది.

కూటమిలో తప్పని కుంపటి

యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూటమికి కుంపటి తప్పలేదు. యలమంచిలి మున్సిపాలిటికి గానూ ఆఖరి నిమిషంలో బీజేపీకి కేటాయించగా రమాకుమారి శనివారం నామినేషన్‌ వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే శుక్రవారం జనసేన తరపున ఛైర్‌పర్సన్‌ కోసం నామినేషన్‌ దాఖలు కావడంతో ఇక్కడి రాజకీయం వేడెక్కింది. బీజేపీకి, జనసేన ఝలక్‌ ఇస్తుందా లేక కూటమి ధర్మం పాటించి చివరి నిమిషంలో ఉపసంహరించుకుంటుందా.. అనేది చూడాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థి తరపున రంగంలోకి దిగుతున్న పెద్ద నేతలు జనసేన అభ్యర్థిని ఎలాగైనా రాజీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నర్సీపట్నంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. టీడీపీ తరపున తిరుగులేని అభ్యర్థిని నిలబెట్టినట్టు ప్రచారం జరుగుతుండగా, ఆమె శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఇక్కడ జనసేన తరపున కూడా ఒక నామినేషన్‌ దాఖలు కావడంతో అందరి దృష్టి పడింది. దీంతో అనకాపల్లి జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో తొలిరోజు కూటమికి సిగపట్లు మొదలు అయ్యాయని చెప్పొచ్చు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

సందడి లేని జోనల్‌ కార్యాలయం

అనకాపల్లి : అనకాపల్లి జోనల్‌ పరిధిలో 107, 108, 109, 110, 111, 112 వార్డులు కొత్తగా ఏర్పడ్డాయి. ఆరు వార్డులకు జోనల్‌ కార్యాలయంలో మూడు వార్డులకు ఒక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని నియమించారు. 107, 108, 109, ఒక అధికారి, 110, 111, 112 వార్డుకు మరో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని నియమించి కొత్తగా కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీరించేందుకు జోనల్‌ కార్యాలయలో శుక్రవారం రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజైన శుక్రవారం ఒక అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. కాగా ఆరు వార్డులకు సంబంధించిన వివిధ రాజకీయపార్టీల నాయకులు ఓటర్ల జాబితాలు కావాలని ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని కోరగా, ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అదేశాలు రాలేదని, ప్రస్తుతం కార్పొరేటర్ల అభ్యర్థుల దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలని మాత్రమే ఆదేశాలున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జోన్‌ పరిధిలో వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు పర్మిషన్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయనాయకులు అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement