ఎస్.రాయవరం : కూటమి నేతలకు భయపడి ఎన్నికల కోడ్ అమలు చేసేందుకు కూడా అధికారులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.సైతారుపేట గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులోనికి రాగానే గ్రామ ముఖ ద్వారం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహంపై ముసుగు వేశారు. కానీ పక్కనే స్థానిక కూటమి నేతలు ఏర్పాటు చేసిన హోంమంత్రి ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు సాహసం చేయలేదు. మండలంలో దాదాపు 25 గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు, గత ప్రభుత్వంలో అభివృద్ధి పథకాల శిలాఫలకాలు కప్పివేస్తూ తీసుకున్న చొరవ సైతారుపేట గ్రామంలో హోంమంత్రి ఫ్లెక్సీ తొలగింపునకు చూపలేదు. కలెక్టర్, మండల అధికారులు రెండు రోజులుగా ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడ అమలు కాలేదు. గ్రామానికి విధులు నిర్వర్తించేందుకు ఈ మార్గం మీదుగా వెళ్లాలి.. సాయంత్రం ఇంటికి వెళ్లాలి.. అయినా కోడ్ ఉల్లంఘన అంశం గుర్తుకు రాకపోవడం గమనార్హం. ఈ దృశ్యాలను చూసి జనం విస్తుపోతున్నారు.


