కొత్త జిల్లాల్లో ఏపీ ఎన్‌జీవో హోం భవనాలు | - | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల్లో ఏపీ ఎన్‌జీవో హోం భవనాలు

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

అనకాపల్లి : రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో కొత్త జిల్లాల్లో ఏపీ ఎన్జీవో హోమ్‌ భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ క్రీడామైదానం నుంచి నెహ్రూచౌక్‌ జంక్షన్‌, రామచంద్ర థియేటర్‌ జంక్షన్‌, నాయుళ్లువీధి మీదుగా ఉడ్‌పేట వరకూ బైక్‌ర్యాలీని ఉద్యోగులు శుక్రవారం నిర్వహించారు. అనంతరం భవనాన్ని విద్యాసాగర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు, సమావేశాలకు, సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. ఉద్యోగులతో పాటు గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈ భవనాలను ఉపయోగించుకోవచ్చాన్నారు. యువతకు 30 శాతం ఎన్జీవో సంఘంలో అవకాశాలు కల్పించామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, వైద్యసేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అనంతరం గాంధీనగరం ఎస్‌ఆర్‌ పంక్షన్‌ హాల్లో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, రాష్ట్ర కార్యదర్శి జి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు భారతిప్రసాద్‌, సుబ్బారెడ్డి, శ్రీరాజు, వేణుగోపాల్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement