దేవరాపల్లి : గురుకుల విద్యాలయంలో విద్యార్థు లు వినియోగించగా వచ్చే వృధా నీటితో గ్రే వాటర్ ప్లాంట్(మలిన నీటి పునరుద్ధరణ) నిర్మాణ పనులను పక్కాగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఆదేశించారు. తెనుగుపూడిలోని డా. బీఆర్.అంబేద్కర్ బాలుర గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్థానిక విద్యాలయంలో ఆయన ఆదేశాలతో చేపడుతున్న గ్రే వాటర్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ ఎం.శివ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక గురుకుల విద్యాలయంలో విద్యార్థులు స్నానాలు, బట్టలు ఉతికిన వృధా నీటిని ఫిల్టర్ చేయడానికి రెండు ఫిల్టరేషన్లను చాంబర్లను నిర్మిస్తున్నామన్నారు. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసి విద్యాలయ ప్రాంగణంలో నాటిన మొక్కల పెంపకానికి వినియోగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ విధంగా చేపట్టడంతో విద్యాలయ పరిసరాలు పరిశుభ్రతతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భూగర్భ జలాల పరిరక్షణకు దోహదపడే దోహదపడుతుందన్నారు. వీబీజీ రామ్జీ పథకం నిధులతో ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట క్లస్టర్ ఏపీడీ బి. శ్రీనివాస్, బీబీజీ రాంజీ ఏపీవో వై.రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, ప్లాంటేషన్ సూపర్వైజర్లు శ్రీనివాస్, సురేష్ స్థానిక గురుకులం అధ్యాపకులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ శివ ప్రసాద్


