కూటమి కక్ష ! | - | Sakshi
Sakshi News home page

కూటమి కక్ష !

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

జిల్లాలో 24 మండలాల్లో 761 జగనన్న లే అవుట్లు ఏర్పాటు

ఇంటి స్థలంలో పాటు 25,761 మందికి ఇళ్లు మంజూరు

గత ప్రభుత్వలోనే 14,429 మంది

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి

చంద్రబాబు సర్కార్‌ రాకతో జగనన్న కాలనీలకు కష్టాలు

మౌలిక వసతుల కల్పనపై తీవ్ర నిర్లక్ష్యం

పేదల ఇళ్లపై

నాతవరం : కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలపై కక్ష కట్టింది. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేదలకు సొంత ఇల్లు నిర్మించేందుకు జిల్లాలో గల 24 మండలాల్లో 761 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. జగనన్న లే అవుట్లలో రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రమాణికంగా ఇంటి స్థలంతో పాటు హౌసింగ్‌ స్కీమ్‌లో జిల్లాలో 25,761 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో గత ప్రభుత్వంలో 14,429 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసేశారు. మిగిలినవి శ్లాబు లెవెల్‌లో 686, రూఫ్‌ లెవెల్‌లో 895, పునాదుల స్థాయిలో 6,978 ఉండగా, మిగిలినవి వివిధ స్థాయి నిర్మాణాల్లో ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సకాలంలోనే బిల్లులు చెల్లించేవారు. జగనన్న కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి లేఅవుట్‌కు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విద్యుత్‌, తాగునీరు, వీధి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేసేంది. లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు నిలుపుదల చేసేశారు.

మంజూరైన ఇళ్లు రద్దు..

జిల్లాలో 761 లేఅవుట్లలో కొన్నింటిని ఇంటి నిర్మాణాలు చేయలేదన్న సాకుతో రద్దు చేసి ఆ స్థలాన్ని మరలా ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది. లే అవుట్లు రద్దు చేసి ఆ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మరల హౌసింగ్‌ స్కీమ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా తీసేశారు. జగనన్న లే అవుట్లలో సదుపాయాల కల్పనలో ఎక్కడ చూసినా తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది.కుళాయిలు శిథిలమై తాగునీటి కోసం లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ పనులు పూర్తి చేయక చిమ్మ చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్లు గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రోడ్లు అభివృద్ధి చేయక రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏ ఒక్క లబ్ధిదారుకు మంజూరు చేసిన దాఖలాలు లేదు. గతంలో మంజూరు చేసిన ఇల్లు కట్టుకుని బిల్లుల కోసం రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నా బిల్లుల చెల్లింపులో అంతులేని జాప్యం జరుగుతుంది.

నాతవరం మండలంలో 56 లే అవుట్లు ఏర్పాటు చేయగా అందులో 2 వేలకు పైగా ఇళ్లు మంజూరు చేశారు. చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన లేఅవుట్లలో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

●ఏజెన్సీ సరుగుడులో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో 80 మందికి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి పథకం పైపులు శిథిలమై తాగునీరు వృధాగా పోతుంది. వీధుల్లో ఏర్పాటు చేసిన కుళాయిలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీధిలైట్లు లేక పొద్దుపోతే చిమ్మ చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. బిల్లులు అందక చాలా మంది లబ్ధిదారులు పునాది స్థాయిలో నిర్మాణాలు అపేశారు. ఈ కాలనీకి వెళ్లే రోడ్డు అభివృద్ధి చేయక అడవిని తలపించేలా దర్శనమిస్తుంది.

●మండల కేంద్రం నాతవరం లే అవుట్లలో 300 మంది లబ్ధిదారులకు స్థలాలు, ఇళ్లు ఇచ్చారు. ఈ కాలనీలో తాగునీటి పథకం నిర్మాణం అసంపూర్తి దశలో ఉంది. తాగునీటి కోసం కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో 100 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీరు లేక అసంపూర్తి నిర్మాణంతో కాలం వెళ్లదీస్తున్నారు. తాండవ జంక్షన్‌లో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నా విద్యుత్‌ లైను ఏర్పాటు చేయక గృహ ప్రవేశాలు చేయకుండా ఎదురుచూస్తున్నారు. ఈ కాలనీ వాసులు సమస్యను నేరుగా స్పీకరు అయ్యన్నపాత్రుడు దృష్టికి స్వయంగా తీసుకెళ్లినా ప్రయోజనకం కలగలేదు. కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా కాలనీ వాసులకు న్యాయం జరగలేదు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement