పకడ్బందీగా ‘టెన్త్‌ క్లాస్‌ మిషన్‌ మార్చి’ కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘టెన్త్‌ క్లాస్‌ మిషన్‌ మార్చి’ కార్యక్రమం

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

● డీఈవో నాగేశ్వరరావు

కశింకోట : విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్‌ నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కశింకోటలోని ఎంఆర్‌సీలో మండల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ రోజులు గైర్హాజరు కారాదన్నారు. వచ్చే దసరా సెలవుల్లో విద్యార్థులకు ఇవ్వవలసిన హోం వర్క్‌ గురించి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. టెన్త్‌ క్లాస్‌ మిషన్‌ మార్చి ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు తప్పనిసరిగా హాజరు వేయాలన్నారు. అనంతరం స్థానిక 4 వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులు తయారు చేసిన నో బ్యాగ్‌ నమూనాలను పరిశీలించి అభినందించారు. వారి చదువు తీరును తెలుసుకున్నారు. పాఠశాలలో శిథిల భవనాల తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎంఈవో రమణశ్రీ, ఉపాధ్యాయులు ఎస్‌. భవాని, జి. హేమకుమారి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement