● సమీక్ష సమావేశంలో జేసీ ఆదేశాలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ శౌర్యమాన్ పటేల్
అనకాపల్లి : మ్యుటేషన్ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉండకుండా నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని జేసీ శౌర్యమాన్‌పటేల్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ, సర్వే, భూమి రికార్డులు, పౌర సరఫరాల శాఖపై మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి, రెవెన్యూ సేవలలో ఆలస్యం లేకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, ఆక్రమణలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డీఆర్వో, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


