ఘనంగా గాంధీ, శాసి్త్ర జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గాంధీ, శాసి్త్ర జయంతి వేడుకలు

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

ఎస్పీ కార్యాలయంలో గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాసి్త్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి

నివాళులర్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

అనకాపల్లి: అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటిష్‌ పాలనకు ఎదురొడ్డి శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహాత్ముడు గాంధీజీ అని డీఎస్పీ ఈ.శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలపాటు సాగిన గాంధీజీ సుదీర్ఘ పోరాటం బ్రిటిష్‌ సామ్రాజ్యాన్నే తలవంచేలా చేసిందన్నారు. బాపూజీ ఆలోచనలు, గాంధేయ సిద్ధాంతాలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం, స్వదేశీ, సామాజిక సామరస్యం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విలువలని తెలిపారు. అలాగే నిరాడంబరత, నిజాయితీకి ప్రతీక అయిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ‘జై జవాన్‌, జై కిసాన్‌’నినాదంతో దేశ రక్షణ, ఆహార భద్రత ప్రాధాన్యతలను చాటిచెప్పిన మహానీయుడు శాస్త్రి అని కొనియాడారు. ఇద్దరు మహానీయుల త్యాగాలు, ఆదర్శాలు ప్రజలకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement