ఫెన్సింగ్ క్రీడాకారిణి పలివెల సాహితీ
అచ్యుతాపురం రూరల్: ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఎర్రవరం గ్రామానికి చెందిన పలివెల సాహితీ అండర్–17 విభాగంలో రజత పతకం సాధించి ప్రతిభ చాటింది. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని అక్షర విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. జాతీయ స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన సాహితీని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో విద్యతో పాటు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.


