15 ఏళ్లకు పోలీసులకు చిక్కిన పాత నేరస్తుడు | - | Sakshi
Sakshi News home page

15 ఏళ్లకు పోలీసులకు చిక్కిన పాత నేరస్తుడు

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

అనకాపల్లి టౌన్‌: సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న పాత కేసు నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ యాదవ్‌ అలియాస్‌ ప్రకాశ్‌ యాదవ్‌పై 2011లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా కోర్టు విధించిన వాయిదాలకు హాజరు కాకుండా నిందితుడు కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో 10వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం నిందితుడిపై నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు టౌన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం గాలింపు చేపట్టింది. కానిస్టేబుళ్లు టి.ఎస్‌.నాయుడు, జగ్గారావు పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement