బాబుకు జ్ఞానోదయం ప్రసాదించు బాపూజీ.! | - | Sakshi
Sakshi News home page

బాబుకు జ్ఞానోదయం ప్రసాదించు బాపూజీ.!

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి

● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి

సీఎం చంద్రబాబుకు జ్ఞానోదయం కల్పించాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న సీఐటీయూ నేతలు, అంగన్‌వాడీ సిబ్బంది

మునగపాక: ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేలా బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శుక్రవారం మునగపాకలో మహాత్మాగాంధీ విగ్రహానికి సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్‌.బ్రహ్మాజీతో కలిసి అంగన్‌వాడీ సిబ్బంది వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆంగన్‌వాడీ సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబుకు మంచి జ్ఞానం కలగాలని కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రామలక్ష్మి, తులసి, అంజలి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement