విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న జిల్లా వృత్తి విద్యాధికారి వినోద్‌బాబు
నర్సీపట్నం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియేట్ బోర్డు వృత్తి విద్యాధికారి మద్దిల వినోద్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రయోగశాల, అబ్జరేషన్ పుస్తకాలతో పాటు టీచింగ్ డైరీలు, నోట్స్‌లు, అటెండెన్స్ రిజిస్టర్లు, ఆఫీసు సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణ సాధించే దిశగా అందరూ విద్యా బోధన చేయాలని పేర్కొన్నారు. అధ్యాపకులు అందరూ సమిష్టిగా కషి చేయాలన్నారు. అధ్యాపకులు చెప్పి అంశాలను అవగాహన చేసుకుని కష్ట పడి చదివి మంచి ఫలితాలు తీసుకువచ్చి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


