మాకవరపాలెం: మండలంలోని కొత్తపాలెంలో గురువారం యాకా గంగబాబు(40) చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందాడు. తన ఇంటి ముందున్న మునగ చెట్టు కాడలు కోసేందుకు ఎక్కగా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. గంగబాబు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.


