సహిత విద్యను సమర్థంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సహిత విద్యను సమర్థంగా అమలు చేయాలి

Oct 2 2026 12:40 AM | Updated on Oct 2 2026 12:40 AM

సహిత విద్యను సమర్థంగా అమలు చేయాలి ● డీఈవో నాగేశ్వరరావు

అనకాపల్లి టౌన్‌ : పాఠశాలల్లో సహిత విద్యా విధానాన్ని సమర్ధంగా అమలు చేసి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు సాధారణ విద్యార్ధులతో సమానంగా విద్యా అవకాశాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. పట్టణ జీవీఎంసీ టౌన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులకు సహిత విద్యపై ఒక రోజు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కలిసి చదువుకోవడమే సహిత విద్యా విధానం ప్రధాన లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో కొత్తగా దివ్యాంగ విద్యార్థులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రశస్త్‌ యాప్‌ ద్వారా స్క్రీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సాధారణ ఉపాధ్యాయులకు సహిత విద్యపై ఆన్‌లైన్‌ ద్వారా కోర్సును అందిస్తున్నామని, ఇవి క్షేత్ర స్థాయిలో అమలు అయ్యేలా ఎంఈవోలు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య రిసోర్స్‌ పర్సన్‌ః బొడ్డు మహలక్ష్మినాయుడు, కోఆర్డినేటర్‌ బి. రామకృష్ణ నాయుడు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement