కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్‌ చేయాలి

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

తుమ్మపాల: సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పీఈటీ కాంట్రాక్టు ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఽఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలో భాగంగా 2012 నుంచి సమగ్ర శిక్ష ద్వారా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, తమ సేవలను గుర్తించి విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలన్నారు. గతంలో అమలు చేసిన ఎంటీఎస్‌ విధానం ప్రకారం ఎస్‌జీటీ స్కేల్‌ రూ.32,670 చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచడంతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు, ఈపీఎఫ్‌, హెల్త్‌కార్డు సౌకర్యాలు కల్పించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగి మృతి చెందితే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని, ఉద్యోగులను ‘పార్ట్‌టైం’గా పేర్కొనే విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement