నర్సీపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఉషూ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు పరవాడలో జరిగాయి. 17 నుంచి 19 సంవత్సరాల విభాగంలో నర్సీపట్నం నుండి 15 మంది బాలికలు పాల్గొనగా, ఆరుగురు ఎంపికయ్యారు. ఈ ఎంపిక పోటీల్లో 80 మందికి పైగా బాలికలు పాల్గొన్నారు. 17 సంవత్సరాల విభాగంలో కావ్య, హరణి, స్వాతి, 19 ఏళ్ల విభాగంలో చందన, ప్రేమ్‌జ్యోతి, ప్రణీతి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ బుల్లబ్బాయి, జెడ్పీ బాలికల హైస్కూల్ పీఈటీ లక్ష్మీ, రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్‌గా ప్రియాంక వ్యవహరించారు. వీరందరినీ నింజాస్ అకాడమీ ప్రతినిధులు అభినందించారు.


