ఒక్క హామీ అయినా నెరవేర్చారా..
మడమ తిప్పని నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఎన్నికల హామీ మేరకు నవ రత్నాలు, హామీ ఇవ్వని ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు ఆర్థిక ఆసరా అందించారు. ప్రశంసలు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ఇస్తానన్న పింఛను అమలు చేయలేదు. 3వ బడ్జెట్‌లో కూడా ఇందుకు నిధులు కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు.హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుండడం శోచనీయం.
– మలసాల కిషోర్, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు, కశింకోట


