జెడ్‌ జోగుంపేటలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు వినతి | - | Sakshi
Sakshi News home page

జెడ్‌ జోగుంపేటలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు వినతి

Feb 22 2026 7:25 AM | Updated on Feb 22 2026 7:25 AM

జెడ్‌ జోగుంపేటలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు వినతి

జెడ్‌ జోగుంపేటలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు వినతి

రావికమతం: జెడ్‌.జోగుంపేట కేంద్రంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకుడు కె. గోవిందరావు, గిరిజనులు శనివారం రావికమతం తహసీల్దార్‌ అంబేద్కర్‌కు వినతి పత్రం అందజేశారు. మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధిలో బంగారుబందలు, కడగడ్డ, అజేయపురం, గంగంపేట, రొచ్చు పణుకు, తాటిపర్తి, పెద్దగరువు, రాయపాడు, నేరెడుబంద, జెడ్‌.జోగుంపేట గ్రామాల్లో సుమారుగా 600 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎలక్షన్‌కు వీరంతా 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న ములకాలపల్లి, చీమలపాడు గ్రామాల్లో గల పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సరైన రహదారి మార్గం లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో వృద్ధులకు డోలీలు కట్టి ,కొందరు గుర్రాలపై, మరికొందరు కాలినడక వచ్చి ఓటు వేస్తున్నారు. ఓటు వేసి తిరిగి ఇంటి కెళ్లి సమయానికి చీకటి పడుతుందని, అందువల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్‌.జోగుంపేటలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుల అధ్వర్యంలో శనివారం రావికమతం తహసీల్దార్‌ అంబేద్కర్‌కు గిరిజనులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయుకుడు కిలో సూరిబాబు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement